ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. భారీ కాన్వాయ్ తో వెలగపూడిలోని సచివాలయానికి సతీమణితో వచ్చిన చంద్రబాబు సరిగ్గా సాయంత్రం 4.41నిమిషాలకు సీఎం కుర్చిలో కూర్చొని బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా మొదటిగా మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న చంద్రబాబుకు రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. దారి పొడవున పూలుజల్లి సీఎంపై తమ ఆదరాభిమానాలు చూపించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. ఇందులో ప్రధానమైనది మెగా డిఎస్సీ ఫైలుపై సంతకం చేస్తారు. అలాగే వైసీపీ సర్కారు తెచ్చిన ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో ఫైలుపై సంతకం చేస్తారు. వీటితో పాటు 4వేల రూపాయలకు పింఛన్ పెంపు,అన్న క్యాంటిన్ పునరుద్దీరణ, స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేయనున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు !
الخميس، 13 يونيو 2024
Andhra Pradesh దారి పొడవున పూలు జల్లి సీఎంపై తమ ఆదరాభిమానాలు చూపించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు మొదటిగా మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు
ليست هناك تعليقات:
إرسال تعليق