తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు . తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామన్నా రు. ప్రజా పాలన అందిస్తామని వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లుపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందన్నారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకు దక్కతాయని పేర్కొన్నారు. ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీ నాయకులందరి కీ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, పదేళ్లు పూర్తి చేసుకుని 11వ ఏటలోకి అడుగుపెడుతోంది.
ఇకపై హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని!
الأحد، 2 يونيو 2024
Andhra Pradesh telangana ఇకపై హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ ప్రజలకు విద్య సీఎం రేవంత్ రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق