ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ పేరుతో ఫేక్‌ కాల్స్‌ ?


పీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఫొటోను డీపీగా పెట్టుకుని అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలంగా ఫేక్‌ కాల్స్‌ చేస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారులు గురర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుపై సైబర్‌ క్రైమ్‌ సీఐ కోమాకుల శివాజీ తక్షణమే స్పందించి సదరు కాల్స్‌ వివరాలు సేకరించారు. జార్ఖండ్‌ నుంచి ఈ ఫేక్‌ కాల్స్‌ వస్తున్నట్లు తెలుసుకుని బ్లాక్‌ చేశారు. కాగా, ఫేక్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సూచించారు. తన ఫొటోతో ఎవరైనా వాట్సాప్‌ కాల్స్ లేదా సందేశాలు పంపితే ఎవరూ స్పందించవద్దని కోరారు.

Post a Comment

0 Comments