టెక్నో కెమన్ సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెక్నో కెమన్ 30 5జీ, కెమన్ 30 ప్రీమియర్ 5జీ పేర్లతో ఈ రెండు ఫోన్‌లను తీసుకొచ్చారు. రెండు ఫోన్‌లను కూడా మిడ్ రేంజ్ బడ్జెట్‌లోనే లాంచ్ చేశారు.టెక్నో కెమన్ 30 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 6nm డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ను ఇచ్చారు. కెమరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరాతో కూడి డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.22,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. కెమన్ 30 ప్రీమియర్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.77 ఇంచెస్‌తో కూడిన 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్ 4nm డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ IMX890 OIS కెమెరా, 50ఎంపీ టెలిఫొటో లెన్స్, 50ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. ధర విషయానికొస్తే 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో IP53 రేటింగ్‌ను అందించారు. 70 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. వైఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. మే 23వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి.
0 Comments