Ad Code

వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7


శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7ని అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్ లో ఆవిష్కరించబోతోంది.  SM-L300, SM-L305, SM-L310, SM-L315 అనే మోడల్ నంబర్‌లతో రాబోయే శాంసంగ్ గెలాక్సీ వాచీ లు FCC సర్టిఫికేషన్‌లో గుర్తించబడ్డాయి. SM-L300 మరియు SM-L310 మోడల్ నంబర్‌లతో కూడిన గెలాక్సీ వాచీలు WiFi కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి.  40mm, 44mm సైజు, SM-L305 మరియు SM-L315 SM-L300, SM-L310 యొక్క LTE కనెక్టివిటీ వేరియంట్‌లు. SM-L305 మోడ్ నంబర్‌తో కూడిన శాంసంగ్ గెలాక్సీ వాచ్ FCC లిస్టింగ్ ప్రకారం 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫీచర్ కు సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే ఇది 50% వేగవంతమైనది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 మరియు వాచ్ 6 సిరీస్‌లు 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. శాంసంగ్ గెలాక్సీ వాచ్ FE మోడల్ నంబర్ SM-R861 గా ఉంది.  ఇది 5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతును కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 లాగానే. అంతే కాకుండా, FCC జాబితాలు రాబోయే స్మార్ట్‌వాచ్‌ల గురించి ఏమీ వెల్లడించలేదు. 

Post a Comment

0 Comments

Close Menu