ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య గత ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధానికి ఇప్పుడప్పుడే ముగింపుపడేలా కన్పించట్లేదు. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారని ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అంతర్జాతీయ నేర న్యాయస్థానంలోనూ దీనిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కీలక అభ్యర్థనలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. గాజా స్ట్రిప్‌లో నెతన్యాహు, ఆయన రక్షణమంత్రి యోవా గాలెంట్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్‌ఖాన్ ఆరోపించారు. వారి కారణంగా ఎంతోమంది అమాయక పౌరులు బాధలు అనుభవిస్తున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఈ యుద్ధంలో అనేకమంది మహిళలు, చిన్నారులు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పౌరులపై పాల్పడిన నేరాలకు గానూ హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అభ్యర్థించారు. వీరి మెరుపు దాడులతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతోమంది తమ ప్రియమైనవారిని కోల్పోయారన్నారు. ప్రాసిక్యూటర్ అప్లికేషన్‌పై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్!
الاثنين، 20 مايو 2024
international ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీమ్‌ఖాన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్ హమాస్
ليست هناك تعليقات:
إرسال تعليق