విద్యుత్ వాహనాలతో కాలుష్యమే ఉండదు. వాతావరణ మార్పుల సమస్యని ఎదుర్కోవాలంటే ఈవీల సంఖ్య పెంచాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వాటికి ప్రోత్సాహకాలూ అందిస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా విద్యుత్ వాహనాల వల్లే ఎక్కువగా వాతావరణం కలుషితం అవుతుందని స్పష్టం చేసింది. Emission Analytics ఇటీవలే ఓ అధ్యయనం చేపట్టి ఈ షాకింగ్ నిజాన్ని చెప్పింది. వాల్ స్ట్రీట్ జర్నల్లో ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఈవీల్లోని బ్రేక్లు, టైర్ల ద్వారా Particle Pollution పెరిగే ప్రమాదముందని తెలిపింది. సాధారణ వాహనాలతో పోల్చి చూస్తే ఈవీల బరువు ఎక్కువగా ఉంటుందని.. బ్రేక్లు, టైర్ల ద్వారా గాల్లోకి భారీ మొత్తంలో particulate matter ని విడుదల చేస్తాయని స్పష్టం చేసింది. సాధారణ వాహనాలతో పోల్చితే...ఇది 1,850 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఈవీల బరువు ఎక్కువగా ఉండడం వల్ల టైర్లు త్వరగా చెడిపోతాయి. ఆ సమయంలో గాల్లోకి టైర్ల ద్వారా హానికర రసాయనాలు విడుదలవుతాయి. క్రూడ్ ఆయిల్ నుంచి తీసిన సింథటిక్ రబ్బర్తో ఈ టైర్లను తయారు చేయడమే ఇందుకు కారణం. దీంతో పాటు బ్యాటరీ బరువు గురించి కూడా ఈ రిపోర్ట్ ప్రస్తావించింది. గ్యాసోలిన్ ఇంజిన్స్తో పోల్చి చూసినప్పుడు ఈవీల బ్యాటరీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఈ అదనపు బరువు కారణంగా బ్రేక్లు, టైర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగానే గాల్లోకి ఎక్కువ కాలుష్యం విడుదలవుతుంది. ఈ రిపోర్ట్ Tesla ఈవీల గురించి ప్రస్తావించింది. Tesla Model Y తోపాటు Ford F-150 Lightning గురించీ చెప్పింది. ఈ రెండు కార్లలో బ్యాటరీల బరువు 1,800 పౌండ్ల కన్నా ఎక్కువగా ఉందని వెల్లడించింది. గ్యాసోలిన్ కార్తో పోల్చి చూస్తే...ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ టైర్ల ద్వారా 400 రెట్ల ఎక్కువగా కాలుష్యం విడుదలవుతోందని తేలింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈవీల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

Post a Comment

Previous Post Next Post