దేశీయ మార్కెట్లో వి30, వి30 ప్రో స్మార్ట్ ఫోన్ లను వివో ఇండియా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ లలో వి30 స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో భారీ కెమేరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ తో తీసుకు వచ్చింది. వివో వి30 స్మార్ట్ ఫోన్ ను రూ. 38,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ కోసం ఈ ధరను నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 8GB + 256GB ని రూ. 40,999 ధరతో ప్రకటించింది. ఇక హై ఎండ్ వేరియంట్ 12GB + 256GB ని రూ. 42,999 ధరతో అందించింది. ఈ ఫోన్ యొక్క Pre Booking లను కూడా ఈరోజు నుండే మొదలు పెట్టింది. ఈ ఫోన్ పైన గొప్ప లాంఛ్ ఆఫర్లను కూడా వివో అందించింది. ఈ ఫోన్ లను HDFC మరియు ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ & EMI ఆప్షన్ లతో కొనే వారికి 10% అధనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పైన రూ. 3,500 రూపాయల అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా లభిస్తుంది. వివో వి 30 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ చాలా సన్నని మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లేని అందించింది. ఈ డిస్ప్లే 1బిలియన్ కలర్స్ సపోర్ట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి వుంది. ఈ ఫోన్ డిస్ప్లే లో పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమేరా వుంది. వివో వి 30 ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ 5జి ప్రోసెసర్ Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు జతగా 12GB RAM తో అందించింది. ఈ ఫోన్ లో (UFS3.1) 128GB మొదలుకొని 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లను కూడా జత చేసింది. ఈ ఫోన్ వివో లేటెస్ట్ Funtouch OS 14 Global సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన నడుస్తుంది. కెమేరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50 MP (AF+OIS) మెయిన్ + 50 MP AF అల్ట్రా వైడ్ సెన్సార్ లు కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ మెయిన్ కెమేరాతో కొత్త స్టూడియో క్వాలిటీ Aura Light ని కూడా జత చేసింది. ఈ ఈ సెటప్ తో అద్భుతమైన పోర్ట్రైట్ ఫోటోలను షట్ చేయవచ్చని వివో తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.
0 Comments