నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ ను హెచ్ఎండీ గ్లోబల్ ఈరోజు లాంఛ్ చేసింది. హెచ్ఎండీ నోకియా ఇండియాలో రూ. 9,999కు విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్స్, హెచ్ఎండీ.కాం నుండి మార్చి 8 వ తేది నుండి సేల్ అవుతుంది. నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ. 12,999 రూపాయల స్టార్టింగ్ ధరలో లభిస్తుండగా, ఇప్పుడు అందించిన కొత్త వేరియంట్ తో ఈ ఫోన్ ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. Snapdragon 480+ 5G ఆక్టా కొర్ ప్రోసెసర్ శక్తితో నడుస్తుంది. కొత్త వేరియంట్ లో 4GB RAM + 2GB Virtual RAM ఫీచర్ ను అందించింది. ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కలిగిన 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. 50MP AF Triple AI Camera కెమెరా సిస్టం, ముందు సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాతో OZO 3D Audio recording ఫీచర్ కూడా ఉంటుంది. ఈ నోకియా స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 20W fast ఛార్జ్ (QC3.0 & PD3.0) సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 13 OS పైన రన్ అవుతుంది. 2 OS అప్గ్రేడ్ లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.


Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ