అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం

الجمعة، 25 فبراير 2022

science Smartphone technologe అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం ఫిబ్రవరి 28న ముగుస్తుంది

t f B! P L


అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ మరోసారి ప్రారంభమైంది. ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. షావోమీ, వన్‌ప్లస్, సాంసంగ్ లాంటి బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1,000 డిస్కౌంట్ పొందొచ్చు. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.6,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొంటే రూ.5,000 అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, కొటక్ బ్యాంక్ కార్డులతో రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.43,999. ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.33,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.20,450 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ హైపర్‌ఫోన్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, హర్మాన్ కార్డన్ రూపొందించిన స్పీకర్ సిస్టమ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల ఐకూ 9 ఎస్‌ఈ మోడల్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ఉండటం విశేషం. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ Samsung HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 50 డైరెక్టర్ మోడ్స్, ప్రో టైమ్ ల్యాప్స్, సినిమాటిక్ ఫిల్టర్స్, ఆడియో జూమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 8కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో కొనొచ్చు. వర్చువల్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ టెక్నాలజీతో 3జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ హైపర్‌ఛార్జ్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్‌తో షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 17 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ