సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో గెలాక్సీ ఏ03 ఫోన్ విడుదలయింది. గత సంవత్సరం నవంబర్‌లోనే ఈ ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేశారు. డ్యుయల్ రేర్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే నోట్స్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. మోటరోలా మోటో ఈ40, రియల్‌మీ సీ25 వై, టెక్నో స్పార్క్ 8సీ లాంటి ఫోన్లకు పోటీగా ఏ03 ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో 3జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ వేరియంట్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ వేరియంట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.10,499 కాగా.. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. సామ్‌సంగ్ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్స్, ఇతర ఈకామర్స్ వెబ్‌సైట్లలో ఈఫోన్‌ను వచ్చే వారం నుంచి కొనుగోలు చేయొచ్చు. డ్యుయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 ఓఎస్, యూఐ కోర్ 3.1, 6.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఇన్‌ఫినిటీ వీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 20.9 ఆస్పెక్ట్ రేషియో, ఆక్టో కోర్ యూనిసాక్ టీ606 ఎస్‌వోసీ ప్రాసెసర్, 1.6 జీహెచ్‌జెడ్, 4జీబీ ర్యామ్, డ్యుయల్ కెమెరా సెటప్, 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, వైఫై, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలయింది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ విడుదల
الجمعة، 25 فبراير 2022
science smart phone technologe టెక్నో స్పార్క్ 8సీ లాంటి ఫోన్లకు పోటీ మోటరోలా మోటో ఈ40 రియల్‌మీ సీ25 వై సామ్‌సంగ్ గెలాక్సీ ఏ03 ఫోన్ విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق