అత్తింటి ఆరళ్లకు బలైన వివాహిత

الجمعة، 2 أكتوبر 2026

Chevella Mandal crime Married Woman Falls Victim to In-laws' Harassment Ranga Reddy District telangana unable to bear the physical and mental harassment

t f B! P L

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారు పెడుతున్న శారీరక, మానసిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతురాలి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటంతో అత్తింటి వారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం చెగూరుకు చెందిన దోర నరసమ్మ మూడవ కుమార్తె రాధిక (26)ను చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన గుండాల మధుకు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో 12 తులాల బంగారం, రూ. 2.50 లక్షల నగదును కట్నకానుకలుగా అందజేశారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఇటీవల రాధికను అదనపు కట్నం తేవాలని భర్త మధు, మామ లక్ష్మయ్య, అత్త పద్మమ్మ, బావ మహేందర్, తోటికోడలు శిరీష కలిసి వేధించడం మొదలుపెట్టారు. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టి నచ్చజెప్పినప్పటికీ అత్తింటివారి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా శారీరక, మానసిక వేధింపులు శృతిమించడంతో 15 రోజుల క్రితం రాధిక తల్లి చేవెళ్ల పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అప్పుడు పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కాగా, రాధిక దంపతులు గత ఆరు నెలలుగా ముడిమ్యాల గేటు వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా యథావిధిగా సెంటర్ వద్దకు వెళ్లారు. అయితే, కొద్దిసేపటికే రాధిక ముడిమ్యాల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుందని మధు అన్న మహేందర్ ఆమె బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, మృతురాలి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటం పట్ల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వారే కొట్టి చంపి, ఉరి వేశారని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ