'సర్'లో తీసేసిన ఓటర్లు ఫారం 6 ఇస్తే తిరిగి చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ : అలా చేస్తే జైలుశిక్ష తప్పదని మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషీ
الجمعة، 2 أكتوبر 2026
Former CEC S.Y. Quraishi warns of jail term for such actions national Special drive to reinstate voters removed during the 'SIR' process via Form 6
దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) నిర్వహించి ఏకంగా 13 కోట్ల మందిని ఓటర్లుగా తొలగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తప్పిదాలకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తప్పుకోవాలంటూ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ తప్పుదిద్దుకునేందుకు మరో ఉత్తర్వు ఇచ్చింది. ఇప్పుడు అది కూడా వివాదాస్పదమవుతోంది. ఇందులో ఈసీ ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తీసేసిన ఓటర్లను ఫామ్ 6 ఇస్తే తిరిగి చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టేలా ఆదేశాలు ఇచ్చింది. ఇది చట్టవిరుద్ధమని, అలా చేస్తే జైలుశిక్ష తప్పదని మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషీ వెల్లడించారు. ప్రత్యేక ఓటర్ల జాబితాలో ఒకసారి తొలగించిన ఓటర్లను తిరిగి ఫామ్ 6 ద్వారా ఓటరు జాబితాల్లోకి చేర్చేందుకు అవకాశం లేదని మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్ వై ఖురేషీ తేల్చిచెప్పారు. తొలగించబడిన ఓటరు ఫారం 6ను పూరించలేరని ఆయన ఇవాళ స్పష్టం చేశారు. ఇది కేవలం కొత్త ఓటర్ల కోసం మాత్రమే అన్నారు. దీన్ని పూరించమని బలవంతం చేసిన వారందరూ ఒక సంవత్సరం జైలు శిక్ష పడే నేరానికి పాల్పడినట్లే అని మాజీ సీఈసీ తెలిపారు. వారిని బలవంతం చేసిన ఈసీ అధికారులు నేరానికి సహకరించినవారే అవుతారన్నారు. కాబట్టి ఈ పత్రికా ప్రకటన ఈసీ అలా చేసేందుకు సహకారాన్ని అందిస్తున్నట్లు స్పష్టం చేస్తోందన్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق