కర్ణాటక యువకుడికి పాక్ ఉగ్రమూకలతో సంబంధాలు : నిందితుడు విశాల్ కుమార్ మెత్రేని అరెస్ట్ చేసిన పోలీసులు
السبت، 3 أكتوبر 2026
Accused Vishal Kumar Metre Arrested Karnataka Youth Linked to Pakistan-Based Terror Groups Karnataka's Bidar district national
కర్ణాటకలోని బీదర్ జిల్లా భాల్కి తాలూకాకు చెందిన 24 ఏళ్ల యువకుడిని పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధాల రవాణా, సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్ ఉగ్రమూకలతో సంబంధాలు కలిగి ఉన్న నిందితుడిని విశాల్ కుమార్ మెత్రే (24)గా గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది షెహజాద్ భట్టి, రానా హునైన్, నోమి ఖాన్‌లతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుధ అక్రమ రవాణాదారులతో ఇతను వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అదేవిధంగా రహే హక్, రాణా భాయ్ 333 అనే వాట్సాప్ ఛానెళ్ల ద్వారా దేశ సమైక్యతకు భంగం కలిగించే వీడియోలు, పోస్టులను విశాల్ వీక్షించినట్లుగా పోలీసులు తెలిపారు. అలాగే ఖలిస్థాన్ అనుకూల భావజాలం, గ్యాంగ్‌స్టర్ల కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లుగా సమాచారం. మరోవైపు, నిందితుడు కుటుంబ ఆస్తి తగాదాల కారణంగా తన తండ్రిని హతమార్చేందుకు పిస్టల్ సమకూర్చుకునే ప్లాన్‌లో భాగంగానే కొందరు నేరస్థులతో ఇతను సంప్రదింపులు జరిపాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా విచారించేందుకు ఎన్‌ఐఏ అధికారులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
ليست هناك تعليقات:
إرسال تعليق