స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎనిమిది రోజుల్లోనే డబుల్ అయిన హీరో మోటార్స్ షేరు !

الجمعة، 2 أكتوبر 2026

business Hero Motors Share Price Doubles Within Eight Days of Market Debut national stock market touching a high of ₹168 on the BSE

t f B! P L

హీరో మోటార్స్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎనిమిది రోజుల్లోనే ఈ షేరు ఏకంగా 105 శాతం పెరిగి ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు చేసింది. అక్టోబర్ 1వ తేదీన ట్రేడింగ్ మొదలవగానే 10 శాతం ఎగబాకి బీఎస్‌ఈలో గరిష్ఠ స్థాయి రూ.168ని తాకింది. సెప్టెంబర్ 23, 2026వ తేదీన మార్కెట్లో లిస్టింగ్ అయింది. అప్పుడు ఇష్యూ ధర రూ. 84 వద్ద ఉండగా డిస్కౌంట్‌తో లిస్టింగ్ అయి నిరాశపరిచింది. కానీ ఆ తర్వాత రికార్డు స్థాయి రాలీతో అంచనాలను తలకిందులు చేసింది. తమ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. 8 రోజుల్లోనే రూ.84 స్థాయి నుంచి రూ.168 స్థాయికి చేరుకుంది. వారం రోజుల్లోనే హీరో మోటార్స్ మార్కెట్ విలువ రూ.7,564 కోట్లకు చేరుకుంది. 27వ వార్షిక సర్వసభ్య సమావేశం ముగియడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేయడం ఈ షేరును మరింత పెరిగేలా చేశాయి. సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం రోజున ఐరేజ్ బ్రోకింగ్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ బీఎస్‌ఈలో 34 లక్షల షేర్లను రూ. 135.70 చొప్పున కొనుగోలు చేసింది. అందులో 12 లక్షల షేర్లను మళ్లీ విక్రయించింది. ఈ పరిణామం మార్కెట్లో ట్రేడర్ల సెంటిమెంట్‌ను మార్చేసింది. భారత టూ-వీలర్ పరిశ్రమ FY31 నాటికి 2.9 కోట్ల నుంచి 3.1 కోట్ల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గేర్లు, ట్రాన్స్‌మిషన్ల మార్కెట్ 8 శాతం వరకు వృద్ధి చెందినట్లయితే ఎలక్ట్రిక్-డ్రైవ్ మోటార్ మార్కెట్ 32 శాతం వేగంతో దూసుకుపోతుందంటున్నారు. ఇవి ఆటోమొబైల్ కంపెనీలకు సానుకూలంగా మారనున్నాయని, ఆయా కంపెనీల షేర్లు రాణించవచ్చంటున్నారు. హీరో మోటార్స్ భారతీయ ఆటో విడిభాగాల తయారీ కంపెనీ మాత్రమే కాదు. అంతర్జాతీయ బీఎండబ్ల్యూ, డుకాటీ ఫార్ములా మోటార్ స్పోర్ట్, ఎన్వియోలో వంటి లగ్జరీ బ్రాండ్లకు పవర్ ట్రైన్ సొల్యూషన్లను అందిస్తోంది. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని దిగ్గజ కంపెనీలకు తమ ఉత్పత్తులను అందించడంతో బలమైన రెవెన్యూ మార్గాన్ని కలిగి ఉంది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, షేరు ధర రెట్టింపైనప్పటికీ, ప్రస్తుత ధరల వద్ద కొనుగోళ్లు జరపడంపై బ్రోకరేజీ వర్గాలు అప్రమత్తత వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నాటి ట్రేడింగ్ చూసుకుంటే ఈ స్టాక్ ఆల్ టైమ్ హై స్థాయి రూ.168ని తాకింది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.80.50గా నమోదైంది. ఈ స్టాక్ పీఈ రేషియో 173గా ఉంది. ఆర్ఓసీఈ వాల్యూ 11.5 శాతంగా ఉంది. ఆర్ఓఈ వాల్యూ 9.81 శాతంగా ఉంది. ఈ స్టాక్ ముఖ విలువ రూ.10గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.7,622 కోట్లుగా ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ