ట్రైలర్ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టిన ఎస్‌యూవీ : ఏడుగురు దుర్మరణం
Tuesday, October 6, 2026
Bhavnagar district Bhavnagar-Alang National Highway gujarat Seven killed SUV Rams into Trailer Truck from Behind
గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో వెళ్తున్న ఎస్‌యూవీ ముందుగా వెళ్తున్న ట్రైలర్ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. భావనగర్-అలాంగ్ జాతీయ రహదారిపై ఎస్‌యూవీ వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ముందున్న ట్రైలర్‌ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఎస్‌యూవీ ముందు భాగం ట్రైలర్‌లోకి దూసుకెళ్లి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతులు అలాంగ్‌లోని షిప్‌బ్రేకింగ్ యార్డుకు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Post a Comment