తాండూరు రైల్వే క్వార్టర్స్ సమీపంలో యువకుడు దారుణ హత్య !

Friday, October 2, 2026

crime Munwar earned his living by driving an auto-rickshaw and selling water bottles telangana Vikarabad district Young Man Brutally Murdered Near Tandur Railway Quarters

t f B! P L

తెలంగాణలోని వికారాబాదు జిల్లా తాండూరు రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. మృతుడిని పట్టణంలోని మాణిక్‌నగర్‌కు చెందిన మున్వర్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం మున్వర్ ఆటో నడుపుతూ వాటర్ బాటిళ్లను విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. కాగా, అతడి కడుపులో కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మున్వర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్వర్‌తో కలిసి మద్యం సేవించిన స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు తాండూరు సీఐ పరమేశ్వర్ తెలిపారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ