.sticky-share{position:fixed;left:0;top:40%;z-index:999;display:flex;flex-direction:column;gap:6px;padding:6px;background:#fff;border-radius:0 6px 6px 0;box-shadow:0 2px 8px rgba(0,0,0,.15)} .sticky-share a{width:38px;height:38px;display:flex;align-items:center;justify-content:center;border-radius:50%;background:#333;color:#fff;font-weight:700;text-decoration:none} @media(max-width:768px){.sticky-share{display:none}} ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ పూర్తి : శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి-LATEST NEWS AP TO TG ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ పూర్తి : శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి-LATEST NEWS AP TO TG
W T F

ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ పూర్తి : శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Tuesday, October 6, 2026

Gajulararamaram in the Quthbullapur constituency hyderabad Indiramma Towers to be Completed Within a Year Minister Ponguleti Srinivasa Reddy at Foundation Stone Ceremony telangana

t f B! P L

హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సహచర మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పలువురు లబ్దిదారులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు 23 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇందిరమ్మ టవర్స్‌ను నిరంతర ప్రక్రియగా నిర్మిస్తామని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇళ్ల కోసం ఏడు వేలకు పైగా దరఖాస్తులు అందగా పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలారని, వారిలో లబ్దిదారుల ఎంపికను బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా చేపట్టి 480 మందిని తుది జాబితాలో ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించామని, ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైందనే వివరాలను కూడా లబ్ధిదారులకు తెలియజేయడంతోపాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేటాయించిన ఇళ్లతో కార్యక్రమం ముగియదని, మరో మూడు విడతల్లోనూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం సుమారు 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, దీనితోపాటు నియోజకవర్గంలో ఉన్న ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తించి అక్కడ కూడా పేదలకు ఇళ్లు నిర్మించే చర్యలు చేపడతామని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అన్నారు. లబ్దిదారులు కూడా తమ ఇళ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పేదల చిన్న చిన్న కోరికలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను కేవలం హామీగా కాక కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ శాఖ సెక్రటరీ వి.పి.గౌతమ్, కలెక్టర్ మనూ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

tag

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ