అమెరికాలో తెలుగు మహిళలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన ట్రక్ : ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Sunday, October 4, 2026
Andhra Pradesh another in critical condition Highway 61 (Dritch Road) in the United States One dead telangana Truck Collides with Car Carrying Telugu Women in the US
అమెరికాలోని హైవే 61 డ్రీటిచ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (31) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం శ్రీను, జ్యోతిల పెద్ద కుమార్తె దారం సుప్రియకు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొడుమూరి రంజిత్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. భర్త అమెరికాలోని మిస్సోరి నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పెళ్లైన తర్వాత సుప్రియ భర్తతోపాటు అక్కడే జీవిస్తుంది. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు సైతం ఉన్నాడు. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తుండగా సుప్రియ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్ ఆర్ ఐ మిత్రురాలితో కలిసి అదే నగరంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి రెస్టారెంట్‌లో పని ముగించుకుని ఇద్దరు కారులో మిస్సోరిలోని ఇంటికి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కారును ట్రక్ వెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు.అయితే ఏపీకి చెందిన మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment