బిట్ చాట్ ను భారతీయ యాప్ స్టోర్ నుంచి తొలగించిన యాపిల్
Sunday, October 4, 2026
allegations of violations regarding IT regulations and central government directives Apple Removes BitChat from Indian App Store has faced a setback in the country technology witter co-founder Jack Dorsey
దేశంలో ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు జాక్ డోర్స్ మద్దతుతో రూపొందించిన ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ బిట్ చాట్ కు చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ఐటీ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ ఈ యాప్‌ను భారతీయ యాప్ స్టోర్ నుంచి తొలగించింది. బిట్ చాట్ అనేది బ్లూటూత్ మెష్ నెట్‌వర్కింగ్ ఆధారంగా పని చేసే ఒక డీసెంట్లైజ్డ్, పియర్ టు పియర్ మెసేజింగ్ యాప్. ఇది ఇంటర్నెట్ సర్వర్లు లేదా సిమ్ కార్డ్ కనెక్షన్ లేకుండానే సందేశాలు పంపుకోవడానికి వీలు కల్పిస్తుంది. జాతీయ భద్రత, సమాచార నిఘా, సైబర్ సెక్యూరిటీ ప్రమాణాల దృష్ట్యా భారతీయ ఐటీ శాఖ, హోమ్ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు యాపిల్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. బిట్ చాట్ యాప్‌లో వినియోగదారుల డేటా నమోదు కాకపోవడం, కేంద్రీకృత కంట్రోల్ లేకపోవడం వల్ల ఆకతాయిలు, అసాంఘిక శక్తులు దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే కారణంతో నియంత్రణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రీకృత సర్వర్లు లేని, ఆఫ్‌లైన్ మెసేజింగ్ ఫీచర్లు ఉన్న యాప్‌ల పట్ల భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనిఈ చర్య స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి యాపిల్ ఐఓఎస్ ప్లాట్ ఫామ్‌పై ఈ యాప్ను నిలిపివేయగా, థర్డ్ పార్టీ లేదా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటుపై భవిష్యత్తులో మరింత స్పష్టత రానుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా రక్షణ కల్పిస్తుందని భావించినప్పటికీ, దేశీయ చట్టాలు, భద్రాత ప్రమాణాలకు లోబడి నడుచుకోని యాప్‌లపై భారత ప్రభుత్వం నిఘా పెంచింది.
No comments:
Post a Comment