ఏపీలో పింఛన్ల పంపిణీకి కొత్త రూల్స్ : నవంబర్ 1 నుంచి కీలక మార్పులు : కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ

Tuesday, October 6, 2026

Central Government Share to be Deposited Directly into Beneficiaries' Bank Accounts Key Changes from November 1 New Rules for Pension Distribution in AP

t f B! P L

నవంబర్ 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విధానంలో  కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు లబ్ధిదారులకు పూర్తి నగదును నేరుగా చేతికే అందిస్తుండగా, ఇకపై ఈ విధానాన్ని రెండు భాగాలుగా విభజించనున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ వాటాను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధాన వాటాను నగదు రూపంలో లబ్ధిదారుల చేతికి ఇస్తారు. కేంద్ర వాటా మాత్రం నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోనే డిపాజిట్ అవుతుంది. ఉదాహరణకు, వృద్ధులకు లభించే రూ. 4,000 పింఛనులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ. 3,800 నగదు రూపంలో లబ్ధిదారుడి చేతికి అందుతుంది, కాగా కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇచ్చే రూ. 200 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అదేవిధంగా దివ్యాంగులకు అందించే రూ. 6,000 పింఛనులో రాష్ట్ర వాటా రూ. 5,700 చేతికి ఇస్తుండగా, కేంద్ర వాటా రూ. 300 బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే వాటా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడాలంటే ఆధార్‌-బ్యాంక్ అకౌంట్ సీడింగ్ తప్పనిసరిగా పూర్తి కావాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ లేని పక్షంలో కేంద్ర వాటా పింఛను సొమ్ము నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పింఛనుదారులు వెంటనే తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ అనుసంధానమై ఉందో లేదో సరిచూసుకోవాలని, ఒకవేళ లింక్ కాకపోతే తక్షణమే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ