భారత కబడ్డీ స్టార్ సంజూ దేవి తన గురించి జరుగుతున్న ప్రచారంపై మాట్లాడుతూ తనను ఎవరూ తక్కువ చేసి చూడలేదని, విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించిందని స్పష్టం చేసింది. జపాన్ వేదికగా హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇరాన్ జట్టును 37-34 పాయింట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండోసారి భారత్ చాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజూ దేవి కూడా సభ్యురాలు. కోర్బాలోని కేరకచర్ గ్రామానికి చెందిన సంజూ రాష్ట్రం తరఫున పసిడి నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. అయితే, ఇంతటి ఘనత సాధించిన తర్వాత కూడా సంజూ దేవికి కనీస గుర్తింపు దక్కలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విమానాశ్రయంలో ఆమెను ఎవరూ పట్టించుకోలేదని, కనీస గౌరవ, సత్కారాలు కూడా అందలేదంటూ.. సంజూ ఒంటరిగా బయటకు వెళ్తున్న వీడియోలను కొంతమంది నెటిజన్లు షేర్ చేశారు. ఈ విషయంపై సంజూ దేవి తాజాగా స్పందించింది. ''ఎయిర్‌పోర్టు బయట దాదాపు ఎనిమిది వేల మంది జనం ఉన్నారని తెలిసింది. కాబట్టి విమానాశ్రయం లోపలే మమ్మల్ని సత్కరించాలని అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించాయి. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదంటూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆ ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. మాకు ఘన స్వాగతం లభించింది. ఘనంగా సత్కరించారు'' అని సంజూ దేవి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. సత్కారం తర్వాత ఎవరి ఊళ్లకు వాళ్లు వెళ్లే క్రమంలో మాత్రమే ఒంటరిగా కనిపించానని స్పష్టం చేసింది. ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన తమ కబడ్డీ ప్లేయర్ సంజూ దేవిని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు సాయి రాయ్‌పూర్‌లో ఉన్న తన నివాసంలో సత్కరించారు. ఆమెకు రూ. 51 లక్షల నజరానా ప్రకటించారు.
నన్నెవరూ పట్టించుకోలేదన్నది అవాస్తవం : కబడ్డీ స్టార్ సంజూ దేవి
Wednesday, October 7, 2026
"It is untrue that I was ignored" allegations made against the Amateur Kabaddi Federation of India and the Sports Authority of India are baseless Kabaddi star Sanju Devi national sports

No comments:
Post a Comment