సౌదీ అరేబియాకు ప్రత్యేక బలగాలను పంపేందుకు పాకిస్తాన్, టర్కీ దేశాలు అంగీకరించాయి. రియాద్‌లో సోమవారం జరిగిన అత్యవసర సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మూడు దేశాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ మీటింగ్‌కు హాజరయ్యారు. సౌదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడినా, దాన్ని తిప్పికొడుతామని మూడు దేశాలు ఐక్యంగా ప్రకటన చేశాయి. మూడు దేశాల అగ్రిమెంట్ ప్రకారం.. ఏ దేశంపై అటాక్ జరిగినా, మిగితా దేశాలు ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవాలని గత ఆగస్టులోనే ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నాటో గ్రూపులో అత్యధిక సైన్యం కలిగిన టర్కీతో పాటు, అణ్వాయుధ దేశం పాకిస్థాన్, గల్ఫ్‌లో కీలక దేశం సౌదీ అరేబియా ఒక్కటైనట్లు నిపుణులు చెబుతున్నారు. తాజా ఒప్పందం ప్రకారం తక్షణమే సౌదీ అరేబియాకు దళాలను పంపేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్లు ఇటీవల సౌదీపై దాడుల్ని పెంచారు. సౌదీ సిటీలను, ఇంధన కేంద్రాలను, షిప్పింగ్ మార్గాలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో సైనికుల్ని పంపిస్తున్నారు.
సౌదీ అరేబియాకు ప్రత్యేక బలగాలను పంపేందుకు అంగీకరించిన పాకిస్తాన్, టర్కీ దేశాలు
Tuesday, October 6, 2026
attended by senior officials from all three nations international Pakistan and Turkey Agree to Send Special Forces to Saudi Arabia

No comments:
Post a Comment