స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ

Monday, October 5, 2026

national Swiss President Guy Parmelin Meets Prime Minister Narendra Modi visited Rajghat and paid tribute to Mahatma Gandhi

t f B! P L

న్యూఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భేటీకి ముందు స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్, ఆయన సతీమణి కరోలిన్ పార్మెలిన్ రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌ కూడా స్విస్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. భారత్-ఇఎఫ్టీఏ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రధాని మోడీతో జరిగే భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాలను విభిన్న రంగాలలో విస్తరించేందుకు దోహదపడుతుందనే ఆశాభావాన్ని విదేశాంగ మంత్రి వ్యక్తం చేశారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలు వర్తకం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, సంస్కృతి వంటి వివిధ అంశాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై విస్తృతంగా చర్చించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ