తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి ఆమె రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. రూ.2 లక్షల్లో భాగంగా రూ.లక్ష ఇవ్వాలని స్వర్ణకుమారి కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం నిఘా పెట్టి,బాధితుడు రూ.లక్షను హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు అందజేసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం శ్రీనివాస్ ఆ నగదును డీఎంహెచ్‌వో డ్రైవర్ కృష్ణయ్యకు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు కారులో పెట్టేందుకు వెళ్తున్న సమయంలో కృష్ణయ్యను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో లంచం డిమాండ్‌కు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు, లంచం డిమాండ్, నగదు తీసుకోవడం వంటి వ్యవహారంలో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్య పాత్రపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఏసీబీ దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి : ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి రూ.2 లక్షలు డిమాండ్
Monday, October 5, 2026
Demanded ₹2 Lakhs to Reopen Physiotherapy Hospital DMHO Swarna Kumari Caught by ACB Ranga Reddy District telangana
No comments:
Post a Comment