ప్రేమను నిరాకరించిందని ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించిన యువకుడు

Friday, October 2, 2026

after his romantic advances are rejected crime hyderabad telangana Uppal police have registered a case against a young man Young man threatens to post photos and videos on social media

t f B! P L

హైదరాబాద్‌లో ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ యువతి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించిన యువకుడిపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు రామంతపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన 20 ఏళ్ల డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థినికి ఖైరతాబాద్‌కు చెందిన అలెక్స్‌(26) అనే ప్రభుత్వ ఉద్యోగి 2024 జూలైలో ఆమె స్నేహితురాలి ద్వారా పరిచయమయ్యాడు. 2025 డిసెంబర్‌లో అలెక్స్‌ ప్రేమిస్తున్నానంటూ ప్రతిపాదించగా ఆమె నిరాకరించింది. దీంతో అతడితో మాట్లాడటం మానేసింది. అయినప్పటికీ అలెక్స్‌ ఆమెను ఎక్కడికి వెళ్లినా వెంటాడుతూ తనతో మాట్లాడాలని, తనను ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన మాట వినకపోతే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించాడని తెలిపింది. ఈ క్రమంలో 2026 మేలో బాధితురాలితో కలిసి ఉన్న ఫొటోలను ఆమె తల్లి వాట్సాప్‌ నంబర్‌కు పంపించాడు. తల్లిదండ్రులు అతడిని మందలించినప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకుండా యువతికి పదేపదే ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ