దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదలైన మివి వన్ 5జీ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల ఫస్ట్ డే సేల్ డిస్కౌంట్ కూపన్ మరియు రూ. 6,00 రూపాయల బ్యాంకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 11,399 రూపాయలకు అందుకోవచ్చు. ఈ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ అందుకోవడానికి ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్ కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించాలి.ఈ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్స్ లో మివి లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రైస్ రూ. 12,999, మిడ్ వేరియంట్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రైస్ రూ. 14,999 మరియు హై ఎండ్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ప్రైస్ రూ. 16,499 తో అందించింది. అయితే, పైన తెలిపిన ఆఫర్స్ తో ఈ ఫోన్ 16 రూపాయల తక్కువ ధరలో ఫస్ట్ సేల్ నుంచి లభిస్తుంది. మివి ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ ను 120 Hz రిఫ్రెష్ రేటుతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ బడ్జెట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 2 తో పని చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో 4 జీబీ, 6 జీబీ మరియు 8 జీబీ ర్యామ్ తో జతగా 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ని అందించింది. ఈ ఫోన్ బ్లోట్ వేర్ లేని ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 18 OS వరకు అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫోన్ తో పాటు వేగంగా చేసే ఫాస్ట్ ఛార్జర్ ను కూడా అందిస్తుంది.
ホーム
/
technology
/
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ : మివి వన్ 5జీ ఫోన్ పై మంచి ఆఫర్ !
Wednesday, October 7, 2026
₹1 ₹600 bank discount 000 'first-day sale' coupon discount business Flipkart Big Billion Days: Great offer on the Mivi One 5G phone technology

No comments:
Post a Comment