Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

హైదరాబాద్ లో ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులోని అత్యంత విలువైన ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ఓ ముఠా మాయమాటలు నమ్మి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రూ.25 లక్షల మేర నగదును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయారు. మాదాపూర్ లాంటి ప్రైమ్ లొకేషన్‌లో కోట్లాది రూపాయల విలువైన భూమిని విక్రయిస్తామని పేరూరి తులసీగోపాల్ అనే వ్యక్తి, అతని కుమారుడు గిరిధర్ ఎమ్మెల్సీ రామచంద్రయ్యను సంప్రదించి డీల్ మాట్లాడారు. స్థలాన్ని చేజిక్కించుకోవాలనే తొందరపాటుతో, కనీసం భూమి అసలు యజమానులు ఎవరో, ఆ స్థలానికి సంబంధించిన టైటిల్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే ఆయన రూ.25 లక్షల టోకెన్ అడ్వాన్స్‌ను ఆర్టీజీఎస్ ద్వారా వారి ఖాతాకు బదిలీ చేశారు. అడ్వాన్స్ పొందిన అనంతరం, స్థలానికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు లాయర్‌కు చూపించి పరిశీలిస్తానని రామచంద్రయ్య అడిగినప్పటికీ, ఆ కేటుగాళ్ళు పత్రాలు ఇవ్వకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. దీంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్సీ ఆరా తీయగా, అసలు ఆ ఐదున్నర ఎకరాల స్థలం ఆ వ్యక్తులది కాదని, తప్పుడు ప్రచారంతో రూ. కోట్లు కాజేయడానికి వ్యూహం పన్నారని తేలింది. మోసపోయానని గ్రహించిన రామచంద్రయ్య వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement