Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను ట్వీట్‌ ద్వారా మరోసారి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బలంగా వినిపించారు. ''జ్ఞానేశ్‌ కుమార్‌ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది. ఆ తర్వాతే ప్రజాస్వామ్యాన్ని బాగుచేసే ప్రక్రియ మొదలవుతుంది'' అంటూ పోస్ట్‌ చేశారాయన. మరోవైపు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సీజేపీ చేపట్టిన 'జంతర్‌ మంతర్‌ 2.0' నిరసనలకు రాహుల్‌ దూరంగా ఉన్నారు. ఆయన శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌తో భేటీ కానున్నారు. అనంతరం విద్యార్థులతో జరిగే 'ఛాత్రోన్‌ కీ గూంజ్‌' కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పేరుతో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇవే డిమాండ్లతో కాక్రోచ్‌ జనతా పార్టీ ఇవాళ జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తమ ధర్నాలకు బ్రేక్‌ ఇచ్చింది.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement