News Breaking
Live
wb_sunny

Breaking News

నెట్‌ఫ్లిక్స్ లో 5 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ?

నెట్‌ఫ్లిక్స్ లో 5 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ?

నెట్‌ఫ్లిక్స్ తన మొత్తం ఉద్యోగుల్లో సుమారు ఐదు శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ సంస్థలో దాదాపు 16వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ లేఆఫ్స్ కారణంగా వందలాది మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంటర్ టైన్మెంట్ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోవడం, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వీక్షకులను, యాడ్స్ రెవెన్యూను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుండటంతో సాంప్రదాయ స్ట్రీమింగ్ సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, ఆదాయ వనరులను విస్తరించుకోవడానికి మీడియా కంపెనీలు నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ తన వ్యూహాలను మార్చుకుంటూ పునర్నిర్మాణ ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. 2022లోనూ యూజర్లు తగ్గటంతో ఉద్యోగులను తగ్గించిన సంగతి తెలిసిందే. కేవలం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుములపై మాత్రమే ఆధారపడకుండా, ఆదాయ మార్గాలను వైవిధ్యపరచుకోవడంపై నెట్‌ఫ్లిక్స్ గత కొంతకాలంగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ అడ్వర్టైజింగ్, లైవ్ ప్రోగ్రామింగ్, గేమింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. మరింత కష్టమర్లతో వృద్ధికి అదనపు అవకాశాలను సృష్టించుకోవడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని కంపెనీ భావిస్తోంది. 

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment