Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతున్న యువతను రైళ్లు రద్దు చేసి, రవాణాపై ఆంక్షలు విధించడాన్ని కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తప్పుబట్టారు. యువతను తక్కువ అంచనా వేయొద్దని, వారిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ''వీళ్లు భారతీయ యువత, వీరిని ఎవరూ ఆపలేరు. ఎన్ని రైళ్లను నిలిపివేస్తారు? ఎంత రవాణాను అడ్డుకుంటారు? ఎన్ని రహదారులను దిగ్బంధిస్తారు?'' అంటూ ప్రశ్నించారు. భారతీయ యువత ప్రపంచానికి దిశానిర్దేశం చేయగల సామర్థ్యం కలిగి ఉందన్నారు. అయితే, నిరసనల పేరుతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరికాదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు, ఎన్నికల్లో గెలవలేక ప్రతిపక్షాలు నిరసనలతో రాజకీయాలు చేస్తున్నాయని చిరాగ్‌ విమర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పదేపదే నగరాన్ని స్తంభింపజేయడం సరికాదన్నారు. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం కంటే ఆందోళనలకే ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ అపాయింట్‌మెంట్‌ కోరాలని, తమ అభ్యంతరాలు, సందేహాలను ఆయన ముందుంచి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement