Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

ఢిల్లీలో తలపెట్టిన 'జంతర్ మంతర్ 2.0' నిరసన కార్యక్రమం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సాంద్రత సవరణ ప్రక్రియలో జరిగిన లోపాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న ఈ ఆందోళనలో పాల్గొనేవారందరూ అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఎలాంటి హింసకు తావులేకుండా పూర్తిగా శాంతియుత మార్గంలోనే తమ నిరసన తెలపాలని స్పష్టం చేసింది. పోలీసుల నుంచి అనుమతి లభించకపోయినప్పటికీ, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారు ఎలాంటి భౌతిక ఘర్షణలకు దిగవద్దని, ఇతరులను బెదిరించే ధోరణిని పూర్తిగా విడనాడాలని సీజేపీ తన అధికారిక ప్రకటనలో కోరింది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం, రాళ్లు రువ్వడం, నిప్పు పెట్టడం లేదా బారికేడ్లను ధ్వంసం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడవద్దని హెచ్చరించింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎమర్జెన్సీ వాహనాలకు అడ్డు తగలకూడదని స్పష్టం చేసింది.  రోగులను తరలించే అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, ఇతర అత్యవసర వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిరసనకారులపై ఉందని సీజేపీ గుర్తుచేసింది. ఆస్పత్రుల ప్రవేశ మార్గాలను లేదా అత్యవసర రూట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ చేయవద్దని సూచించింది. అలాగే ప్రదర్శనకారులు ఎవరూ కూడా తమ వెంట ఎలాంటి ఆయుధాలు, కర్రలు, రాళ్లు లేదా మండే పదార్థాలను తీసుకురావద్దని గట్టిగా హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులు లేదా సాధారణ ప్రజలను కించపరిచేలా వ్యక్తిగత విమర్శలు, ద్వేషపూరిత ప్రసంగాలు చేయరాదని సీజేపీ స్పష్టం చేసింది. బారికేడ్లను బలవంతంగా తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని సూచించింది. అలాగే సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు సమాచారం, నిర్ధారణ కాని వీడియోలు లేదా వందల మందిలో భయాందోళనలు సృష్టించే పుకార్లను షేర్ చేయవద్దని కోరింది. ఏదైనా ఉద్రిక్తత ఏర్పడితే అక్కడి నుంచి శాంతియుతంగా పక్కకు తప్పుకోవాలని, తమ గ్రూపులతోనే ఉండాలని సూచించింది.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement