నిమ్స్ ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. లక్ష్మీ భాస్కర్ అరెస్ట్ : ఆదాయానికి మించి ఆస్తులు బయటపడినట్లు గుర్తించిన ఏసీబీ

الثلاثاء، 22 سبتمبر 2026

ACB Finds Disproportionate Assets crime hyderabad NIMS Hospital Additional Superintendent Dr. N. Lakshmi Bhaskar Arrested telangana

t f B! P L

నిమ్స్ ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. లక్ష్మీ భాస్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో, కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాలలో ఆదాయానికి మించి ఆస్తులు బయటపడినట్లు గుర్తించారు. భూములు, బంగారం, బంగ్లాలు, ప్లాట్లు, ఇళ్లు ఉన్నాయని గుర్తించారు. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. మొత్తం మూడు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు జరపడంతో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ తనిఖీల్లో నిర్ఱారణ అయింది. ఏసీబీ సోదాల్లో హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లోని సుమారు 12 నుండి 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులుతనిఖీలు చేపట్టారు. ఎర్రగడ్డలోని కల్పతరు అపార్ట్‌మెంట్స్ సహా ఆయన బంధువుల నివాసాలలోనూ ఈ సోదాలు కొనసాగాయి. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. కొందరికి కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినట్లు కూడా గుర్తించారు. అలాగే యాదాద్రి జిల్లాలో భూములు ఉన్నట్లు కనుగొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం వంద కోట్లకు పైగానే ఆస్తులున్నాయని గుర్తించారు. యాదాద్రి, నందిగామలో ప్లాట్లు ఉన్నాయని ఈ సోదాల్లో వెల్లడయింది. ఆదాయానికి మించిన ఆస్తులు...అలాగే బంగారు ఆభరణాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో లక్ష్మీ భాస్కర్ ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చే అవకాశాలున్నాయి. ఉదయం నుంచి లక్ష్మీ భాస్కర్ ఇంట్లో, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన సోదాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. : నిమ్స్‌లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, పెద్దఎత్తున డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నట్లు సమాచారం. ఆయన ఇంటి నుంచి బంగారు ఆభరణాలతో పాటు కొంత మొత్తం నగదును కూడా స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ