హైదరాబాద్‌లో భారీ వర్షం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ

الثلاثاء، 22 سبتمبر 2026

affecting the Secunderabad and Charminar areas Chief Minister Revanth Reddy Issues Key Directives Heavy Rain in Hyderabad Khairatabad telangana

t f B! P L

హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా భారీ వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, గోల్కొండ, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. గత రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రెండు గంటలకు పైగా ఏకధాటిగా పడుతున్న వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకస్మాత్తుగా కురిసిన ఈ వానతో ఆఫీసుల నుంచి వెళ్లే ఉద్యోగులు ముప్పుతిప్పలు పడ్డారు. ఈ క్రమంలోనే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని నగర ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా అధికారులతో పాటు పోలీసు కమిషనర్లు కచ్చితమైన సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధాన రహదారులు, ముఖ్యమైన జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా నీరు నిలిస్తే వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించి క్లియర్ చేయాలన్నారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని, అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు చెక్ చేయాలని చెప్పారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని, ప్రజలకు కనీస ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ