గంట సమయం గాలిలో ప్రయాణించిన తర్వాత ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య : లండన్‌లో తిరిగి ల్యాండింగ్
الأربعاء، 23 سبتمبر 2026
Boeing 787-9 aircraft national returns to London for landing Technical issue on IndiGo flight after an hour in the air
ఇండిగోకు చెందిన 6ఈ4 విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. సుమారు గంట సమయం గాలిలో ప్రయాణించిన తర్వాత బోయింగ్ 787-9 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ ఇండిగో ఫ్లైట్ లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24.కామ్ వెబ్‌సైట్ ఈమేరకు నిర్ధారించింది. అయితే ఇండిగో సంస్థ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆ విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య ఏమిటి? అందులో ఎంత మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు? అన్న వివరాలు తెలియలేదు.
ليست هناك تعليقات:
إرسال تعليق