ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం : ఇద్దరు నవజాత శిశువులు దుర్మరణం

Tuesday, September 22, 2026

electrical short circuit in an air conditioner Fire at Adilabad RIMS safely evacuating 28 other infants from the ward telangana Two Newborns Perish

t f B! P L

దిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రిమ్స్‌ లోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సీయూ)లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీలో చోటుచేసుకున్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి, కొద్దిసేపట్లోనే వార్డు అంతటా దట్టమైన పొగ, అగ్నికీలలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ దురదృష్టకర ఘటనలో ఇద్దరు నవజాత శిశువులు ఊపిరిరాడక మృతి చెందారు. సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి వార్డులోని మరో 28 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ  ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. శిశువుల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందో లేదో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై తక్షణమే విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ