మెటా 'మ్యూజ్' పర్సనల్ ఏఐ ఏజెంట్‌తో ఇంటిగ్రేషన్‌ను తీసుకొచ్చిన స్పాటిఫై

الجمعة، 25 سبتمبر 2026

Connecting Meta's Muse with Spotify makes music playback much easier Spotify Integrates with Meta's 'Muse' Personal AI Agent technology

t f B! P L

మెటా 'మ్యూజ్' పర్సనల్ ఏఐ ఏజెంట్‌తో స్పాటిఫై ఇంటిగ్రేషన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త కాంబినేషన్‌తో యూజర్లు స్పాటిఫైలో పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఆడియోబుక్స్‌ను కేవలం ఏఐతో మాట్లాడటం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మెటా మ్యూజ్‌ను స్పాటిఫైతో కనెక్ట్ చేసిన తర్వాత మ్యూజిక్ ప్లేబ్యాక్ మరింత సులభంగా మారుతుంది. యూజర్లు తమకు కావాల్సిన పాటను వెతకడం, ప్లే చేయడం, క్యూలో పెట్టడం, నచ్చిన ట్రాక్‌ను సేవ్ చేయడం వంటి పనులను మ్యూజ్ ఏఐ ఏజెంట్ ద్వారా చేయించుకోవచ్చు. అంతేకాదు.. కొత్త ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయాలన్నా, ఇప్పటికే ఉన్న ప్లేలిస్ట్‌లో కొత్త పాటలను యాడ్ చేయాలన్నా ఏఐతో మాట్లాడితే సరిపోతుంది. యూజర్ కోరుకున్న పాటల ఆధారంగా ప్లేలిస్ట్‌ను తయారు చేయడంతో పాటు, దానికి సరిపోయే పేరును కూడా ఏఐ ఏజెంట్ సూచించగలదు. ఈ ఇంటిగ్రేషన్‌లో స్పాటిఫై 'పర్సనల్ పాడ్‌కాస్ట్' ఫీచర్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. రోజువారీ సమాచారం, ముఖ్యమైన విషయాలు లేదా నోట్స్‌ను మ్యూజ్ ఏఐ ఏజెంట్ ఆడియో రూపంలోకి మార్చగలదు. తయారైన ఆడియో నేరుగా యూజర్ స్పాటిఫై లైబ్రరీలో 'పర్సనల్ పాడ్‌కాస్ట్'గా సేవ్ అవుతుంది. దీంతో ఖాళీ సమయం దొరికినప్పుడు వాటిని పాడ్‌కాస్ట్‌లా వినొచ్చు. మ్యూజ్ కేవలం పాటలు ప్లే చేసే ఏఐ ఏజెంట్‌గానే కాకుండా యూజర్ రోజువారీ షెడ్యూల్‌కు అనుగుణంగా ఆడియోను ప్లే చేసేలా పనిచేయనుంది. ఉదాహరణకు ఉదయం 7 గంటలకు రన్నింగ్‌కు వెళ్లే అలవాటు ఉంటే, ఆ సమయంలో రన్నింగ్ ప్లేలిస్ట్ ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆఫీస్ వర్క్ సమయంలో ఫోకస్ పెంచే మ్యూజిక్ కావాలంటే, క్యాలెండర్ షెడ్యూల్ ఆధారంగా సంబంధిత ప్లేలిస్ట్‌ను ఆటోమేటిక్‌గా ప్రారంభించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్‌లు, రోడ్ ట్రిప్‌ల కోసం కూడా మ్యూజ్‌లో ప్రత్యేక సదుపాయం ఉంటుంది. యూజర్ తాను వెళ్లాల్సిన డెస్టినేషన్‌ను ఏఐ ఏజెంట్‌కు చెబితే, ఆ ప్రయాణానికి సరిపోయే మ్యూజిక్‌తో ప్రత్యేక ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయగలదు. అంతేకాదు.. ట్రిప్ ప్రారంభమయ్యే సమయాన్ని బట్టి ఆ ప్లేలిస్ట్ ఆటోమేటిక్‌గా ప్లే అయ్యేలా ముందుగానే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. దీంతో డ్రైవ్ మొదలైన వెంటనే మ్యూజిక్ కోసం విడిగా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. స్పాటిఫై, మెటా మ్యూజ్ ఇంటిగ్రేషన్‌తో యూజర్లకు మరింత పర్సనలైజ్డ్ ఆడియో అనుభవాన్ని అందించడంపై ఫోకస్ చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ కాంబినేషన్‌లో మరిన్ని ఏఐ ఫీచర్లను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పాటిఫై తెలిపింది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ