ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం శివకోటి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజోలు యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన సేత్తిమె శ్రీనివాస్ (40) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. మామిడికుదురు నుంచి చించినాడ వైపు ఎన్‌హెచ్ రోడ్డుపై వాహనాన్ని అధిక వేగంతో నడుపుతూ, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్‌ను గమనించకపోవడంతో ఢీకొట్టినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నైట్ బీట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజోలు సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎన్‌హెచ్ రోడ్డు వెంబడి విద్యుత్ వైర్ల మరమ్మతులు జరుగుతున్నప్పటికీ ప్రమాదాల నివారణకు సరైన ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
ホーム
/
Razole Mandal
/
శివకోటి బైపాస్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్‌ను ఢీకొట్టి వ్యక్తి మృతి
الاثنين، 7 سبتمبر 2026
Andhra Pradesh crime Dr. B.R. Ambedkar Konaseema district Man Dies After Crashing into Temporary Diversion at Shivakoti Bypass Razole Mandal
ليست هناك تعليقات:
إرسال تعليق