బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు : వీడియో సోషల్ మీడియాలో వైరల్‌

الجمعة، 18 سبتمبر 2026

international Passengers Brawl on Biman Bangladesh Airlines Flight traveling from London to Dhaka Video goes viral

t f B! P L

లండన్ నుంచి ఢాకా వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం గొడవకు దిగారు. మొదట మాటలతో మొదలైన వివాదం కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిపోర్టుల ప్రకారం, బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ముందుగా వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే ఆ వివాదం భౌతిక దాడికి దారితీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు బిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధ ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు మొదట వాగ్వాదానికి దిగడం, ఆ తర్వాత పరస్పరం కొట్టుకోవడం కనిపిస్తోంది. గొడవ సమయంలో ఒక ప్రయాణికుడి టీ-షర్ట్ చినిగిపోయినట్లు వీడియోలో కనిపించింది. పరిస్థితి అదుపు తప్పడంతో కేబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించారు. చివరికి వారిని వేరు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్‌ (పబ్లిక్ రిలేషన్స్) మహబూబుద్దీన్ అహ్మద్ స్పందించారు. తనకు ఈ ఘటనపై అప్పటివరకు పూర్తి సమాచారం లేదని, విషయం తెలుసుకుంటున్నానని తెలిపారు. అయితే గొడవకు అసలు కారణం ఏమిటి? ప్రయాణికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారా? అనే వివరాలు వెంటనే వెల్లడికాలేదు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ