రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే తమపై చేస్తున్న ఆరోపణలు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

الجمعة، 18 سبتمبر 2026

Allegations against us are part of political vendetta BRS Working President KTR Fabricating new narratives to constantly mislead the public through mind games telangana

t f B! P L

కాంగ్రెస్ ప్రభుత్వం తమపై చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తిన్నారంటూ విపరీతంగా దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు మళ్లీ కొత్త కథనాలు అల్లుతూ నిత్యం ప్రజలను మైండ్ గేమ్‌తో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పెట్టిన కేసుల్లో ఎలాంటి వాస్తవం లేదని, తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్‌ఎస్ నాయకులు లక్షల కోట్లు కొల్లగొట్టారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "రేవంత్ రెడ్డికి నేనొక మంచి ఆఫర్ ఇస్తున్నా, ఆయన చెబుతున్న లక్ష కోట్ల రూపాయల్లో మాకు కేవలం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం రాసి ఇచ్చేస్తాం. మిగిలిన 99 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలు కోసం ఖర్చు చేసుకోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. ఆరోపణలు చేయడం తప్ప వాటిని నిరూపించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ మార్క్ విషప్రచారం సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రతీ రోజూ ఓ కొత్త వివాదాన్ని లేదా విచారణల డ్రామాను తెరపైకి తెస్తున్నారని అన్నారు. కక్షసాధింపు చర్యలతో ప్రతిపక్ష నోరు నొక్కలేరని, చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందనడానికి తాము విచారణకు హాజరవ్వడమే నిదర్శనమని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆత్మరక్షణలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విచారణ సంస్థలను వాడుకుంటోందని కేటీఆర్ అంటున్నారు. ఎంతమంది అధికారులతో విచారణ చేయించినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా నిజాలు మారవని తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా అభివృద్ధిని వదిలేసి, ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్‌కి ప్రజలే త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ