ప్రజలు పాలించే బర్రెను వదులుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు !

السبت، 26 سبتمبر 2026

BRS Working President KTR People let go of a milch buffalo and brought home a buffalo bull that kicks Revanth Reddy is an 'honest fraudster' telangana

t f B! P L

తెలంగాణ భవన్‌లో శనివారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన సత్తూరి యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పాలించే బర్రెను వదులుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్‌కు సమయం ఇచ్చారని, మూడేళ్లు ఆయన ప్రజల ముందుకు రాకపోయినా గల్లీ గల్లీలో కేసీఆర్ పాటలే వినిపిస్తున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో రైతులు నాట్లు వేసే సమయానికే నేరుగా ఖాతాల్లో రైతుబంధు పడేదని గుర్తుచేసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని విమర్శించారు. 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఎవరు గెలిచినా కేసీఆరే సీఎం అవుతారని సంక్షేమ పథకాలు బంద్ కావని ప్రజలు అనుకున్నారు. కానీ 'అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్లు' రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందన్నారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే గెలిచిన నాయకుడు కనబడకుండా పోయాడని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయం మారబోతోందని 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దోపిడీ, అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఓటు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని, కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ