మార్కులు పెంచుకోవడానికి గోల్డెన్ ఛాన్స్ : ఫీజు లేకుండా సీబీఎస్‌ఈ స్పెషల్ ఎగ్జామ్స్
الأربعاء، 23 سبتمبر 2026
A Golden Opportunity to Improve Marks Bahrain CBSE Special Exams Without Fees education IRAN Kuwait national Oman Qatar Saudi Arabia UAE
పశ్చిమాసియా దేశాల్లో మొన్నటిదాకా నడిచిన పరిస్థితుల వల్ల చాలామంది సీబీఎస్‌ఈ 12వ తరగతి స్టూడెంట్స్ బోర్డు ఎగ్జామ్స్ రాయలేకపోయారు. ఆ టైమ్‌లో వాళ్లకు బోర్డు ఒక ఇంటర్నల్ మార్కుల ఫార్ములా వేసి (అసెస్మెంట్ స్కీమ్ ద్వారా) పాస్ చేసేసింది. అర్హులైన స్టూడెంట్స్ అందరికీ మళ్లీ ఫ్రెష్‌గా ఎగ్జామ్స్ పెడుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఇరాన్‌లలోని సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివిన రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ప్రైవేట్ అభ్యర్థులుగా రిజిస్టర్ అయిన వాళ్లంతా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అయితే ఒక విషయం ఇక్కడ క్లియర్‌గా గుర్తుంచుకోవాలి: మీరు మళ్లీ ఎగ్జామ్ రాస్తే, ఇప్పుడు రాసే పేపర్‌లో వచ్చే మార్కులే ఫైనల్ అవుతాయి! పాత మార్కుల మార్క్స్ కార్డ్ రద్దయి, ఈ కొత్త మార్కులే అప్‌డేట్ అవుతాయి. ఈ స్పెషల్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థుల నుంచి బోర్డు ఎగ్జామ్ ఫీజు వసూలు చేయడం లేదు. ఇవి పూర్తిగా ఉచితంగానే నిర్వహిస్తారు. విద్యార్థులు సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 26 వరకు తమ దరఖాస్తులను స్కూళ్ల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే ఎగ్జామ్ డేట్స్ అండ్ టైమ్‌టేబుల్‌ను బోర్డు అనౌన్స్ చేస్తుంది.
ليست هناك تعليقات:
إرسال تعليق