అమెరికా మళ్లీ దాడులకు దిగితే యుద్ధాన్ని మహాసముద్రం వరకు విస్తరిస్తాం : ఖమేనీ సీనియర్‌ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరిక

الخميس، 24 سبتمبر 2026

If the US attacks us again international Warning from Khamenei's senior advisor Yahya Rahim Safavi we will extend the war to the Indian Ocean

t f B! P L

మెరికా తమపై మళ్లీ దాడులకు దిగితే, ఈ యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ సీనియర్‌ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు. ఇరాన్‌ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు బదులుగా.. ఇరాన్ తన సైనిక వ్యూహాలను మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్రంలోని హర్మూజ్ జలసంధి వరకే పరిమితమైన దాడులు.. భవిష్యత్తులో అమెరికా స్థావరాలు, యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని హిందూ మహాసముద్రం నుంచి తిప్పికొడతామని సఫావీ పేర్కొన్నట్లు ఇరాన్‌కు చెందిన ఫార్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రసారం చేసింది. అమెరికా కవ్వింపు చర్యలు, ఆర్థిక ఆంక్షలు, నౌకాశ్రయాల దిగ్బంధాన్ని తిప్పికొట్టేందుకే ఈ వ్యూహాత్మక మార్పు చేస్తున్నట్లు ఇరాన్‌ ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. సఫావీ హెచ్చరికలతో గల్ఫ్‌ ఆఫ్‌ ఓమన్‌, పర్షియన్‌ గల్ఫ్‌తో పాటు  హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐరోపాను ఆసియాతో కలిపే బాబ్ అల్-మండెబ్ జలసంధి, ఎర్రసముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఆడెన్‌ తదితర సముద్ర రవాణా మార్గాల్లో నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ