వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ పెద్దల ఆదేశాలకు తలొగ్గి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు లభించాయి. సుదీర్ఘకాలం పాటు సస్పెన్షన్‌లో ఉండి, ఆ తర్వాత విధుల్లో చేరేందుకు పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న ఈ ఇద్దరు అధికారులను కూటమి ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. కాంతి రాణా టాటాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా, విశాల్ గున్నీని పోలీస్ ట్రైనింగ్ డీఐజీగా నియమిస్తూ లూప్ లైన్ పోస్టులను కేటాయించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వీరు ప్రదర్శించిన అపరిమితమైన ఉత్సాహం, ప్రతిపక్ష నేతలు , అమాయకులపై పెట్టిన అక్రమ కేసులు, ముఖ్యంగా ముంబై నటి కాదంబరీ జెత్వానీ వ్యవహారంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగించిన తీవ్ర వేధింపుల ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నాటి విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఉన్న కాంతి రాణా టాటా, డీసీపీగా పనిచేసిన విశాల్ గున్నీలు పొలిటికల్ బాస్‌ల మెప్పు కోసం నిబంధనలను కాళ్లరాసి ప్రవర్తించారనే ప్రాథమిక విచారణ నివేదికల ఆధారంగానే కూటమి ప్రభుత్వం రాగానే వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న ఈ అధికారులు, సస్పెన్షన్ ఎత్తివేతతో పాటు తిరిగి పోస్టింగ్‌లు దక్కించుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల చుట్టూ తిరగడం, ప్రభుత్వానికి సుదీర్ఘ వివరణలు ఇస్తూ వినతిపత్రాలు సమర్పించడంతో పాటు తాము కేవలం పైఅధికారుల ఆదేశాలను మాత్రమే పాటించామని విన్నవించుకున్న తర్వాతే ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంది. అయితే, సస్పెన్షన్ ఎత్తివేసినంత మాత్రాన వారిపై ఉన్న శాఖాపరమైన, విచారణాత్మక చర్యలు ఆగిపోవని తేల్చిచెప్పిన సర్కార్, వీరికి సాధారణ పోస్టింగ్‌లు మాత్రమే ఇచ్చి జీఏడీలో పక్కన బెట్టింది.
రాణా టాటా, విశాల్ గున్నీలకు అప్రాధాన్య పోస్టింగులిచ్చిన కూటమి ప్రభుత్వం
الاثنين، 21 سبتمبر 2026
Alliance Government Assigns Low-Profile Posts to Kanthi Rana TatamVishal Gunni Andhra Pradesh revocation of their suspension and obtain new postings
ليست هناك تعليقات:
إرسال تعليق