హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో ఆటో డ్రైవర్‌పై ఓ యూట్యూబర్ తన స్నేహితులతో కలిసి దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మొహమ్మద్ ముక్రం అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళ ఆయన ఆటో ఎక్కి తన ఇంటికి చేరుకుంది. ఆటో ఛార్జీ కింద రూ.200 చెల్లించే సమయంలో చిల్లర విషయమై సదరు మహిళ కుమారుడు మొహమ్మద్ అజీమ్‌తో ముక్రంకు మాటామాటా పెరిగింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో విసిగిపోయిన ఆటో డ్రైవర్, డబ్బులు కూడా తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినప్పటికీ పగ పెంచుకున్న అజీమ్ తన స్నేహితుడు షోయబ్‌తో పాటు మరో ఇద్దరిని పిలిపించి, ఆటో డ్రైవర్ ముక్రంను ఫలక్‌నుమా వట్టేపల్లిలోని నైస్ హోటల్ సమీపానికి రప్పించాడు. ముక్రం అక్కడికి రాగానే అజీమ్, షోయబ్ తదితరులు ఒక్కసారిగా ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ముక్రం స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ముక్రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడు మొహమ్మద్ అజీమ్ స్థానికంగా యూట్యూబర్‌గా చలామణి అవుతున్నట్లు విచారణలో తేలింది. అజీమ్, అతని స్నేహితులు ఒక ముఠాగా ఏర్పడి మీడియా ముసుగులో వట్టేపల్లి ప్రాంతంలో ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఆటో డ్రైవర్‌ను స్నేహితులతో కలిసి కొట్టి చంపిన యూట్యూబర్
الاثنين، 21 سبتمبر 2026
crime currently absconding Falaknuma Police Station Hyderabad's Old City telangana YouTuber Beats Auto Driver to Death with Friends
ليست هناك تعليقات:
إرسال تعليق