మందాడి సినిమా నిన్న ఒక్క రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూళ్లు రాబట్టడంతో వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ నివేదికల ప్రకారం 11వ రోజు రూ.8 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంచనాలు వేసినట్టే ఈ వీకెండ్‌లో ఈ మూవీ వసూళ్లలో భారీగా పుంజుకుంది. శనివారం ఇండియాలో 6.55 కోట్లు రాబట్టిన ఈ మూవీ నిన్న 8 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది. విడుదలయ్యాక రెండవ ఆదివారం కూడా ఈ సినిమాకు వసూళ్లలో ఈ స్థాయి జోరు చూపించడం గమనార్హం. ఈ మూవీకు విడుదలయ్యాక రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. అయినప్పటికీ అవేమీ మూవీ వసూళ్లపై ప్రభావాన్ని చూపించలేదు. విడుదలైన తొలి రోజునుంచే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ వచ్చింది. నిన్న దేశవ్యాప్తంగా 3,865 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమాకు 38.8 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీ నమోదైంది. అంతకుముందు రోజు రూ.6.55 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు రాబట్టిన 'మండాడి' 11వ రోజు ఏకంగా 22.1 శాతం గ్రోత్ నమోదు చేసింది. దీంతో 11 రోజులకు కలిపి 'మందాడి' సినిమా మొత్తం దేశవ్యాప్త నెట్ కలెక్షన్స్ రూ.75.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ.88.32 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్‌లో 11వ రోజు రూ.0.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో.. అక్కడ ఇప్పటివరకు మొత్తం రూ.15.40 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో 11 రోజుల్లో 'మండాడి' ప్రపంచవ్యాప్తంగా రూ.103.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
వంద కోట్ల క్లబ్ లో చేరిన 'మందాడి' సినిమా
الاثنين، 21 سبتمبر 2026
'Mandadi' Enters the 100-Crore Club ₹8 crore in India net collections on its 11th day Andhra Pradesh cinema tamilnadu telangana
ليست هناك تعليقات:
إرسال تعليق