రష్యా పార్లమెంటరీ ఎన్నికలు : తిరుగులేని మెజారిటీని అందుకున్న అధికారిక యునైటెడ్ రష్యా పార్టీ

الاثنين، 21 سبتمبر 2026

international party has captured a massive 57.5 percent of the vote Ruling United Russia Party Secures Overwhelming Majority Russian Parliamentary Elections

t f B! P L

రష్యా పార్లమెంటరీ ఎన్నికలలో అధికారిక యునైటెడ్ రష్యా పార్టీ తిరుగులేని మెజారిటీని అందుకుంది. అత్యంత స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది. ప్రారంభ ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకారం.. ఈ పార్టీ ఏకంగా 57.5 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. ఉక్రెయిన్‌పై సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటున్న సైనిక చర్యల నిర్ణయాలకు ప్రజల నుండి లభిస్తున్న మద్దతుగా ఈ విజయాన్ని రష్యా ప్రభుత్వం ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో యుద్ధ వ్యతిరేక గళాలు వినిపించకుండా కఠినమైన చట్టాలు అమలు చేస్తున్న తరుణంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ పరిస్థితుల్లో యునైటెడ్ రష్యాకు ఎదురు లేకుండాపోయిందీ ఎన్నికల్లో. గట్టి ప్రతిపక్షం లేని వాతావరణంలో ఈ ఏకపక్ష విజయం నమోదు కావడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగిన తర్వాత రష్యాలో జరిగిన మొట్టమొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అక్కడి ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం మీద అందరి దృష్టీ ఈ ఎన్నికల మీదే నిలిచింది. బలమైన ప్రతిపక్షం అంటూ ఏదీ లేకపోవడంతో అంచనాలకు తగ్గట్టే ఏకపక్షంగా మారాయి ఈ ఎన్నికలు. మొత్తం 450 స్థానాలు ఉన్న స్టేట్ డ్యూమాలో పాగా వేయడానికి కమ్యూనిస్టులు, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ రష్య, న్యూ పీపుల్ వంటి ఇతర పక్షాలు రేసులో ఉన్నప్పటికీ.. ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావాన్నిచూపలేకపోతున్నాయి. గట్టిపోటీ కూడా ఇవ్వట్లేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కూడా పెరిగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార యునైటెడ్ రష్యా పార్టీకే మళ్లీ పట్టం కట్టారు. 2021 నాటి పార్లమెంట్ ఎన్నికలలో 51.72 శాతం మేర పోలింగ్ నమోదైంది. సుమారు 11 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు పేపర్ బ్యాలెట్లతో పాటు రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో ఓటు వేశారు. మాస్కోలో అత్యధిక పోలింగ్ నమోదైంది. ఈ ఫలితాలపై రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ ప్రజలు తమ పార్టీపై మళ్లీ నమ్మకాన్ని ఉంచారని వ్యాఖ్యానించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాంక్షించే రష్యన్ ఓటర్లందరూ తమ పార్టీకి మద్దతుగా నిలిచారని, అందుకే రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకోవడం దాదాపు ఖాయమైందని పేర్కొన్నారు. ఓటర్ల ఆకాంక్షలకు అనుగుణంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ