మద్యం రవాణా కేసు : అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు జారీ
الجمعة، 25 سبتمبر 2026
Andhra Pradesh ED Issues Fresh Notices to Ambati Rambabu he must appear for questioning on the 28th of this month Liquor Transport Case
మద్యం రవాణా కేసుకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. వివాదాస్పదమైన మద్యం రవాణా, ఆర్థిక లావాదేవీల కేసుకు సంబంధించి అంబటి రాంబాబును విచారించాలని ఈడీ భావిస్తోంది. వాస్తవానికి ఆయన ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, తనకు మరో తేదీని కేటాయించాలని అంబటి రాంబాబు అధికారులను కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు, ఈ నెల 28న విచారణకు విధిగా హాజరుకావాలని స్పష్టం చేస్తూ మరోసారి నోటీసులు జారీ చేశారు.
ليست هناك تعليقات:
إرسال تعليق