ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పామని, అధికారంలో రావడంతో చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. టీచర్లు గౌరవంగా జీవించాలంటే నాయకుల చుట్టూ తిరగకూడదని చెప్పారు. ప్రతిభ ఉన్న టీచర్లను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బడులకు వెళ్లి చదువుకోవాలని సూచించారు. ఇతర పనులకు వెళ్లొద్దని చెప్పారు. యూనివర్సిటీల్లో కొన్ని కోర్సులు చదువుకునేందుకు విద్యార్థులు లేరని తెలిపారు. ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడే కోర్సులు ప్రవేళపెట్టాలన్నారు. టీచర్లకు సాయం చేసేందుకు త్వరలో ఏఐ ఉపాధ్యాయులు వస్తారని స్పష్టం చేశారు. 1991 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పోటీతో పాటు అవకాశాలు కూడా పెరిగాయని తెలిపారు. టెక్నాజీ వల్ల మంచి, చెడు ఉన్నాయన్నారు. ప్రస్తుత కాలంలో బోధనా విధానంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. తాము చిన్నగా ఉన్న సమయంలో టీచర్లు కొట్టావారని, అందువల్ల క్రమశిక్షణగా చదువుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. టీచర్లతో తన్నులు తిన్న వాళ్లంతా బాగుపడతారని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు ఏమి చెప్పాలన్నా టీచర్లు వెనకడుగు వేస్తున్నారన్నారు. పిల్లల్లో మానసిక పరిస్థితిని టీచర్లు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. సోషల్ మీడియా పిల్లలకు శాపంగా మారిందని, కుటుంబ విలువలు, నైతిక ప్రవర్తన పెంపుపై టీచర్లు ఫోకస్ పెట్టాలని చంద్రబాబు సూచించారు. అన్ని స్కూళ్లలో మౌలికలు వసతులు కల్పిస్తున్నామని, పరిసరాల్లో పచ్చదనం ఉంటే పిల్లలకు మంచి ఆలోచనలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి దశ, దిశ చూపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. టీచర్లు ఎప్పుడూ నిత్య విద్యార్థుల్లా ఉండాలని చెప్పారు. ఎప్పుడైతే నేర్చుకోవడం నిలిపివేస్తారో ఆ టీచర్లందరూ ఔట్ డేటెడ్ అవుతారని చంద్రబాబు పేర్కొన్నారు.
టీచర్లకు సాయం చేసేందుకు త్వరలో ఏఐ ఉపాధ్యాయులు : టీచర్స్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
السبت، 5 سبتمبر 2026
AI Teachers to Assist Teachers Soon Andhra Pradesh CM Chandrababu Naidu at Teachers' Day Celebrations Teachers' Day celebrations in Vijayawada
ليست هناك تعليقات:
إرسال تعليق