ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతడిని ఒకరోజు పోలీస్ కస్టడీకి అప్పగించింది. అయితే భారద్వాజ్‌కు కేవలం ఒక్కరోజు పోలీస్ కస్టడీ మంజూరు చేయడంపై విద్యార్థి తరఫు న్యాయవాది రిషవ్ రంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడిని న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారని తెలిపారు. తాము కోర్టులో విచారణ కోసం ఎదురుచూస్తుండగా, నిందితుడిని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచినట్లు తర్వాత తెలిసిందన్నారు. కేసులో ఏ సెక్షన్లు చేర్చారో, ఎఫ్ఐఆర్‌లో ఎలాంటి మార్పులు చేశారో తమకు పూర్తి వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. జంతర్‌మంతర్‌లో జరిగిన ఘటనపై ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. 14 ఏళ్ల దళిత విద్యార్థిని తండ్రి తలను తానే పగలగొట్టానని చెప్పుకున్నాడు. తనకు కేంద్ర మంత్రుల పరిచయాలు కారణంగా తనపై పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సీజేపీ నాయకులు నిరసనకు దిగారు. స్వతంత్ర భరద్వాజ్‍ను అరెస్ట్‌ను డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా తదితరులు ప్రతిపక్ష నేతలతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. లోక్‌సభ ఎంపీలు చంద్రశేఖర్, పప్పు యాదవ్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు బాలిక ఆన్‌లైన్ బెదిరింపులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అతడిపై ప్రత్యేకంగా పోక్సో చట్టం కింద మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భరద్వాజ్‌కు మరో చిక్కు ఎదురైంది. తన పోడ్‌కాస్ట్‌లో పేరు ప్రస్తావించిన కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ ఆయనపై ఫిర్యాదు చేశారు. తన పేరును భరద్వాజ్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భారద్వాజ్‌తో తనకు గానీ, పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ఎల్‌జేపీ లీగల్ విభాగం స్పష్టం చేసింది. ప్రజా జీవితంలో ఉన్నవారు అనేక మందిని కలుస్తుంటారని, అందువల్ల వారితో వ్యక్తిగత పరిచయం ఉన్నట్లుగా భావించలేమని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.
ホーム
/
Uttar Pradesh
/
పోలీస్ కస్టడీకి ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్
السبت، 5 سبتمبر 2026
arrested in Bulandshahr Influencer Swatantra Bharadwaj Remanded to Police Custody national objected to the granting of only one day of police custody Uttar Pradesh
ليست هناك تعليقات:
إرسال تعليق